1 |
వడ్డించే వాడు మనవాడైతే వెనక బంతిలో కూర్చున్నా ఫరవాలేదు |
Vaddinche vadu manavadyithe venka bantilo kurchunna paravaledhu |
2 |
వసుదేవుడంతటివాడు గాడిద కాళ్లు పట్టుకున్నట్లు |
Vasudhevudu antati vadu gadida kallu pattukunnattu |
3 |
వంగుతున్న కొద్దీ ఇంకా వంచాలని చూస్తారు |
Vangutunna konddi inka vanchalani chustaru |
4 |
వంట ఇంటి కుందేలు లాగా |
Vanta inti kundhelu laga |
5 |
విగ్రహపుష్టి నైవేద్యనష్టి |
Vigraha pusti nivedhya nasti |
6 |
వినేవాడు వెధవ అయితె పంది కూడా పురాణం చెపుతుంది |
Vine vaadu vedhava ayithe pandi kuda puranam chebutundi |
7 |
వస్తే కొండ పోతే వెంట్రుక |
Vaste konda lekapothe ventruka |
8 |
వాపు బలపూ కాదూ వాత అందమూ కాదు |
Vaapu balapu kadhu vaatha andhamu kadhu |
9 |
వాసి తరిగితే వన్నె తరుగుతుంది |
Vaasi tarigite vanne tarugutundi |
10 |
విత్తు ముందా చెట్టు ముందా ? |
Vittu mundha chettu mundha ? |
11 |
విదియ నాడు కాకపోతే తదియ నాడైనా కనపడక తప్పదు |
Vidhiya nadu kakapothe tadhiya nadayina kanapadaka tappadu |
12 |
వేన్నీళ్ళకి చన్నీళ్ళు తోడు |
Vennellaku channellu thodu |
13 |
వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలి |
Viyyaniki ayina kayyaniki ayina sama ujji undali |
14 |
వేపకాయంత వెర్రి |
Vepakayantha verri |
15 |
వైద్యోనారాయణోహరి |
Vidhyo narayano hari |
16 |
వృద్ధనారీ పతివ్రత |
Vrudhha naaree pativartha |
17 |
వింటే భారతం వినాలి తింటే గారెలే తినాలి |
Vinte bharatham vinali tinte garale tinali |
18 |
వాన ఉంటే కరువు,పెనివిటి ఉంటే పేదరికం లేదు |
Vaana unte karuvu penimiti unte pedharikam ledhu |
19 |
వెక్కిరించబోయి బొర్లాపడినట్టు |
Vekkirinchaboyi borla padinattu |
20 |
వచ్చిన అపవాదు చచ్చినా పోదు |
Vacchina apavadu chachina podhu |
21 |
వెతకబోయిన తీర్ధం ఎదురయినట్టు |
Vetakaboayina teerdham edurayinattu |
22 |
వెనకా ముందు చూసి మాట్లాడాలి |
Venka mundhu chusi matladali |
23 |
వచ్చేదల్లా రానీ పోయేదల్లా పోనీ |
Vacceadallaa raanee poayeadallaa poanee |
24 |
వెదవ ముండకయిన వెవిళ్ళు తప్పవు |
Vedava mumDakayina vevillu tappavu |
25 |
వేమన్న మాట వెర్రి మాట కాదు |
Vemanna maata verri maata kaadu |