చందమామ చందమామ ఓ చందమామ
చందమామ కుతురే నీలగిరి కన్య
నీలగిరి కన్య కింది నిత్యమల్లి చెట్టు
నిత్యమల్లి చెట్టు కింద జీడిమొలచింది
జీడిగింజ తలుపులు నే తిచ్చనేర
నా కంటె చెల్లెలు అతి ముద్దరాలు
అతిముద్దరాల్చేతి నాలవంకిల్లు
పాలవంకిలు మీద భమిడిపువ్వులు
భమిడిపువ్వుల మీద పుంజాయి దండ
పుంజాయి దండపై పువ్వుల రవిక
పువ్వుల రవికె మీద పట్టంచు చీర
పట్టంచు చీరగట్టి ఏ వాడబోదు ?